భారతదేశం, అక్టోబర్ 20 -- Thaman: విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఆదర్శ కుటుంబం' (హౌజ్ నెంబర్ 47 - #AK47). ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన సెకండ్ సింగిల్ 'మాలా వచ్చా చూడు' ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఆదర్శ కుటుంబం మూవీ నుంచి రెండో పాటగా 'మాలా వచ్చా చూడు' లిరికల్ సాంగ్ రీసెంట్ గా రిలీజైంది. నివేదా పేతురాజ్ గ్లామర్, వెంకీ మామ ఎనర్జిటిక్ డ్యాన్స్ స్టెప్పులు, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం ఈ పాటకు ప్లస్ పాయింట్లుగా నిలిచాయి. అయితే, విజువల్స్ పరంగా ఈ సాంగ్ అలరిస్తున్నప్పటికీ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ట్యూన్ మాత్రం వివాదంలో చిక్కుకుంది.

ఈ పాట విడుదలైన కొద్దిసేపటికే నెటిజన్లు ఇందులోని మ్యూజిక్ బీట్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ను పసిగట్టారు. గతంలో తమన...