భారతదేశం, అక్టోబర్ 25 -- హైదరాబాద్ నగర ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) మరో అద్భుతమైన న్యూస్ అందించింది. రోజువారీ ఉద్యోగులు, విద్యార్థులు, అలాగే వ్యాపార పనుల నిమిత్తం క్యూర్ పరిధిలో నిత్యం ప్రయాణించే పౌరుల జేబులకు భారం తగ్గించేలా రూ.600లకే వారం రోజుల పాటూ అపరిమిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

నగర రవాణాను మరింత సులభతరం, బడ్జెట్ ఫ్రెండ్లీగా మార్చడమే లక్ష్యంగా టీజీఎస్ఆర్టీసీ అధికారులు ఈ కొత్త వీక్లీ పాస్ పథకానికి రూపకల్పన చేశారు.

ఈ పాస్ కొనుగోలు చేసిన తేదీ నుంచి సరిగ్గా వరుసగా 7 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని ఆర్టీసీ బస్సుల్లోనూ ప్రయాణించవచ్చు. ఇందులో ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డిలక్స్ మాత్రమే కాకుండా ఏసీ బస్సులలో కూడా అపరిమితంగా ప్రయాణించే అవకాశం ...