భారతదేశం, మే 27 -- TGSRTC Electric Buses : భాగ్యనగర వాసులకు పర్యావరణ హితమైన, సౌకర్యవంతమైన ప్రజా రవాణాను మరింత చేరువ చేస్తూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) మరో కీలక అడుగు వేసింది. గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా కూకట్‌పల్లి బస్ డిపోకు కేటాయించిన 60 సరికొత్త ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం జెండా ఊపి అధికారికంగా ప్రారంభించారు.

కూకట్‌పల్లి బస్ డిపోలో అత్యంత ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్, ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ (MD) వై. నాగిరెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి సహా పలువురు ఉన్నతాధికారులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.

బస్సుల ప్రారంభోత్సవం అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. నగరంలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై తీవ్ర ఆందోళన వ్యక్త...