భారతదేశం, జూలై 1 -- బెంగళూరు - హైదరాబాద్ మధ్య ప్రయాణించే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGSRTC) శుభవార్త చెప్పింది. ప్రయాణికుల సౌకర్యాన్ని మరింత పెంపొందించేందుకు రెండు నగరాల మధ్య నడిచే అన్ని ఏసీ స్లీపర్, నాన్-ఏసీ బస్సులకు బోర్డింగ్ (బస్ ఎక్కే పాయింట్) , అలైటింగ్ (బస్ దిగే పాయింట్) పాయింట్లను భారీగా పెంచినట్లు టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. ప్రయాణికులు తమకు నచ్చిన, ఉండే ప్రాంతానికి దగ్గరలోని ప్రాంతాల నుంచే సులభంగా బస్సులు ఎక్కేందుకు, దిగేందుకు వీలుగా రూట్లను కింది విధంగా క్రమబద్ధీకరించారు.

పీనియా రూట్ : పీనియా (Peenya), యశ్వంతపూర్ మెట్రో స్టేషన్, కెంపెగౌడ బస్ స్టేషన్ (మెజెస్టిక్), హెబ్బల్, ఎస్టీమ్ మాల్, ఎలాహంక, బెంగళూరు ఎయిర్ పోర్ట్ టోల్ ప్లాజా, దేవనహళ్లి బైపాస్

చందాపూర్ రూట్ : చందాపూర్, బొమ్మసంద్ర, ఎలక్ట్రానిక్ సిటీ, బొమ...