భారతదేశం, ఏప్రిల్ 15 -- ప్రయాణికులకు భద్రత కల్పించే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( టీజీఎస్ఆర్టీసీ ) తెలంగాణ పోలీసుల భాగస్వామ్యంతో ఆదిలాబాద్ జిల్లాలో 'బస్సులో భరోసా' పథకాన్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో బస్సుల్లో జరిగే కార్యకలాపాలను సరిగ్గా పర్యవేక్షించేందుకు, ప్రయాణికులకు తగిన భద్రత కల్పించేందుకు జిల్లాలో నడుస్తున్న 175 టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాల ద్వారా దొంగతనం, వేధింపుల వంటి ఎలాంటి తప్పుడు పనులు చేసినా.. సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతుంది. దీంతో అధికారులు నిందితులను పట్టుకునేందుకు సులువుగా ఉంటుంది.

ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సమక్షంలో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఈ పథకాన్ని ఆవిష్కరించారు. ఆదిలాబాద్‌లో భద్రతను పెంచేందుకు పోలీసులు అన్ని బహిరంగ ప్రదేశాలలో సీసీటీ...