భారతదేశం, జూన్ 12 -- TGSPDCL Services : టీజీఎస్పీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు భారీ ఊరట లభించనుంది. క్షేత్రస్థాయిలో చేపట్టే చిన్న చిన్న పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా విద్యుత్ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది.

డివిజనల్ ఇంజినీర్ (DE), సూపరింటెండెంట్ ఇంజనీర్ (SE), చీఫ్ ఇంజనీర్ (CE)లకు పనుల మంజూరు అధికార పరిమితిని పెంచుతూ సంస్థ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ (గతంలో జీతేష్ వి పాటిల్ సమీక్షించిన ప్రతిపాదనల మేరకు) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం వల్ల వినియోగదారులకు నాణ్యమైన సేవలు మరింత వేగంగా అందనున్నాయి.

గతంలో డివిజన్ స్థాయిలో పనుల మంజూరు పరిమితి కేవలం రూ. 2 లక్షలు మాత్రమే ఉండేది. దీనిని ఇప్పుడు ఏకంగా రూ. 10 లక్షలకు పెంచారు. అంతేకాకుండా.. సూపరింటెండెంట్ ఇంజనీర్ (SE) పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 25 లక్షలకు, చీఫ్ ...