భారతదేశం, ఫిబ్రవరి 23 -- విద్యుత్ వినియోగదారులకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) కీలక అలర్ట్ ఇచ్చింది. ఇప్పటికే పలు సాంకేతిక ఆధారిత సేవలను అందుబాటులోకి తీసుకురాగా... తాజాగా వాట్సాప్ చాట్ ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరించే సేవలను ప్రారంభించింది. ఈ నూతన విధానం ద్వారా వినియోగదారుల సమస్యలను మరింత వేగంగా,సమర్థవంతంగా పరిష్కరించవచ్చని సంస్థ తెలిపింది.

అప్రకటికత కరెంట్ కట్, విద్యుత్ మీటర్లలో సమస్యలు, కరెంట్ బిల్లుల చెల్లింపు, స్టేటస్ వంటి వాటిని ఒక్క మెసేజ్‌తో తెలుసుకోవచ్చు. ఈ మేరకు 8712441912 నెంబర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ వాట్సాప్ చాట్ బాట్ సేవలతో వినియోగదారుల సమస్యలను వేగంగా తెలుసుకోవటంతో పాటు పరిష్కరించవచ్చని సంస్థ అధికారులు తెలిపారు. ఈ తరహా సేవలపై వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Published by HT Di...