TGPSC Syllabus Change : టీజీపీఎస్సీ నుంచి అలర్ట్.. పోటీ పరీక్షల సిలబస్ మార్పుపై అప్డేట్!
భారతదేశం, సెప్టెంబర్ 21 -- తెలంగాణలో వివిధ ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల సిలబస్ మార్పులపై వస్తున్న ఊహాగానాలకు, విజ్ఞప్తులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) చెక్ పెట్టింది. పలు ఉద్యోగ నియామకాలకు సంబంధించి సిలబస్ సవరణలపై అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున విన్నపాలు, విచారణలు వస్తుండటంతో స్పష్టతనిస్తూ టీజీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది.
వివిధ ఉద్యోగ పరీక్షల సిలబస్‌ను మార్చేందుకు టీజీపీఎస్సీ ఎలాంటి ప్రత్యేక సిలబస్ కమిటీని ఏర్పాటు చేయలేదని టీజీపీఎస్సీ తేల్చిచెప్పింది. నియామక పరీక్షల సిలబస్‌లో ఏవైనా పెద్ద ఎత్తున మార్పులు చేయాల్సి వస్తే, ఆ వివరాలను కనీసం ఒక సంవత్సరం ముందే అభ్యర్థులకు ముందస్తుగా తెలియజేస్తామని కమిషన్ స్పష్టం చేసింది.
ఒకవేళ సిలబస్‌లో చాలా స్వల్పమైన మార్పులు ఉంటే.. ఆ వివరాలను సంబంధిత ఉద్యోగ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌తో పాటే విడు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.