భారతదేశం, జూన్ 8 -- ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇటీవలనే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లను విడుదల చేస్తూ నియామక ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే వివిధ శాఖల్లో కొలువుదీరాలనుకునే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల కోసం మొత్తం 290 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE), అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి కమిషన్ మూడు వేర్వేరు నోటిఫికేషన్లను జారీ చేసింది.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం విడుదలైన మూడు నోటిఫికేషన్లలో రోడ్లు, భవనాల (R&B) శాఖలోనే అత్యధికంగా ఉద్యోగాలు ఉన్నాయి.

మొదటి నోటిఫికేషన్ ద్వారా ఆర్ అండ్ బీ శాఖలోని 222 అసిస్టెంట్ ఎగ్జిక్...