భారతదేశం, జూలై 8 -- TGPSC Seed Certification Office Recruitment 2026 : వ్యవసాయ శాఖలో కీలకమైన సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ (విత్తన ధృవీకరణ అధికారి) పోస్టుల భర్తీకి సంబంధించి టీజీపీఎస్సీ ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ తాజాగా ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు.

రాష్ట్ర స్థాయి కేడర్‌లో జనరల్ రిక్రూట్‌మెంట్ కింద మొత్తం 19 విత్తన ధృవీకరణ అధికారి ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు కమిషన్ ఆగస్టు 12, 2026 వరకు గడువు ఇచ్చింది.

ఈ పోస్టులకు పోటీ పడాలనుకునే అభ్యర్థులు నిర్దేశిత విద్యా అర్హతలను కలిగి ఉండటం తప్పనిసరి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్...