భారతదేశం, జూలై 11 -- ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) మరో శుభవార్త చెప్పింది. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 7 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో స్టేట్ లెవల్‌లో 2 పోస్టులు, మల్టీజోన్ పరిధిలో 5 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.

అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 15, 2026 నుంచి ఆగస్టు 22, 2026 సాయంత్రం 5:00 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ముందే దరఖాస్తు చేసుకోవాలని కమిషన్ సూచించింది. ఈ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షను అక్టోబర్ 2026లో నిర్వహించేందుకు తాత్కాలికంగా షెడ్యూల్ ఖరారు చేశారు. పరీక్ష తేదీకి 7 రోజుల ముందు నుండ...