భారతదేశం, జూలై 10 -- TGPSC Town Planning Recruitment 2026 : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) అలర్ట్ ఇచ్చింది. రాష్ట్ర టౌన్‌ అండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా. నేటి నుంచి దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10 అసిస్టెంట్‌ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.58,850 నుంచి రూ.1,37,050 వరకు భారీ వేతనాన్ని చెల్లిస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు కూడా అందుతాయి.

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుం...