భారతదేశం, సెప్టెంబర్ 28 -- TGPSC Exam Schedule 2026 : ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక అప్డేట్ అందించింది. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించి గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు ఆధారంగా రిక్రూట్‌మెంట్ పరీక్షల షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ పరీక్షలన్నీ కంప్యూటర్ ఆధారిత టెస్ట్ (CBT) విధానంలోనే జరుగుతాయని కమిషన్ స్పష్టం చేసింది. పోస్టుల వారీగా పరీక్షల షెడ్యూల్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి..

పాఠశాల విద్యాశాఖలోని డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ (DEO) మరియు గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్-I పోస్టులకు నవంబర్ 12, 13 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు కమిషన్ తెలిపింది. అభ్యర్థులు ఈ పరీక్షలు సీబీటీ విధానంలోనే జరుగుతాయనే విషయాన్ని గమనించి.. తదనుగుణంగా తమ ప్...