భారతదేశం, అక్టోబర్ 14 -- హైదరాబాద్ నగరంలో ఇల్లు లేని పేదలకు సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'ఇందిరమ్మ ఇండ్లు - అఫోర్డబుల్ అర్బన్ హౌసింగ్ ప్రోగ్రామ్' వేగవంతానికి తెలంగాణ హౌసింగ్ బోర్డు (TGHB) కీలక అడుగు వేసింది.ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న సీయూఆర్‌ఈ (CURE) పరిధిలో చేపట్టే నిర్మాణ పనుల పర్యవేక్షణ కోసం తాత్కాలిక (ఔట్‌సోర్సింగ్) ప్రాతిపదికన అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

క్వాలిఫైయింగ్ పరీక్షలో వచ్చిన ప్రతిభ (మెరిట్) ఆధారంగా అభ్యర్థులను ప్రాథమికంగా ఎంపిక చేస్తారు. అనంతరం టీజీహెచ్‌బీ (TGHB) చీఫ్ ఇంజినీర్ కార్యాలయం మరియు ఏజెన్సీ సంయుక్తంగా నిర్వహించే ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు కేవలం గూగుల్ ఫారమ్ (Google Form) ఆన్‌లైన్ లింక్ ద్వారా మాత్రమే తమ దర...