భారతదేశం, జూన్ 4 -- Telangana Weather Updates : ఎండ తీవ్రతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. రాష్ట్రంలో రాబోయే ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఇవాళ్టి బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని అంచనా. అంతేకాకుండా రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుండి 5 డిగ్రీల సెల్సియస్ వరకు క్రమంగా తగ్గుముఖం పట్టనున్నాయి.

వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది. ఉరుములు, మెరుపు...