భారతదేశం, జనవరి 2 -- తెలంగాణ టెట్‌ జనవరి-2026 పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఈ మేరకు విద్యాశాఖ ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ పరీక్షలు జనవరి 3వ తేదీన ప్రారంభమైం. జనవరి 20వ తేదీతో ముగుస్తాయి. అంటే 9 రోజుల్లో 15 సెషన్లలో పరీక్షలను పూర్తి చేస్తారు.

విద్యాశాఖ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 గంటల వరకు నిర్వహిస్తారు. ఈసారి గతంతో పోల్చితే టీజీ టెట్ - 2026కు భారీగానే దరఖాస్తులు వచ్చాయి. పేపర్‌1, 2, కలిపి మొత్తం 2,37,754 దరఖాస్తులు అందాయి. ఇందులో 71,670 మంది ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులున్నారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....