భారతదేశం, ఏప్రిల్ 16 -- Telangana TET Syllabus 2026 : తెలంగాణలో ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జూన్ సెషన్ - 2026 నోటిఫికేషన్ విడుదల కావటంతో దరఖాస్తులను కూడా స్వీకరిస్తున్నారు.

మరోవైపు అభ్యర్థులకు అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన సిలబస్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. టెట్ అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.

కేవలం చదవడమే కాకుండా.. సిలబస్‌పై స్పష్టమైన అవగాహన పెంచుకోవడం విజేతగా నిలవడానికి చాలా ముఖ్యం. అభ్యర్థులు ఎటువంటి గందరగోళానికి గురికాకుండా అధికారిక వెబ్‌సైట్ నుంచే సిలబస్‌ను పొందాలని నిపుణులు సూచిస్తున్నారు.

తెలంగాణ టెట్ పరీక్షను రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు బోధించాలనుకునే వారు పేపర్-1, ఆరు నుండి ఎనిమిదవ తరగతి వరకు బోధిం...