భారతదేశం, జూన్ 9 -- తెలంగాణ టెట్ కు సిద్ధమవుతున్న టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET) హాల్ టికెట్లను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

జూన్ 16వ తేదీ నుంచి జూన్ 22వ తేదీ వరకు ఆన్‌లైన్ (కంప్యూటర్ ఆధారిత) విధానంలో టెట్ పరీక్షలను నిర్వహించనున్నారు. పరీక్షకు హాజరయ్యే వారు హాల్ టికెట్‌తో పాటు ఏదైనా ఒక ప్రభుత్వ గుర్తింపు కార్డును తప్పనిసరిగా వెంట తీసుకువెళ్లాల్సి ఉంటుంది. హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత దానిపై ఉన్న అభ్యర్థి పేరు, ఫోటో, సంతకం, పరీక్షా కేంద్రం వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏవైనా తప్పులు ఉంటే వెంటనే టెట్ కన్వీనర్...