భారతదేశం, ఏప్రిల్ 11 -- తెలంగాణలో 2026 సంవత్సరానికి మెుదటి విడత ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏడాది రెండుసార్లు టెట్ జరపాల్సి ఉంది. ఇటీవల పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన విషయం తెలిసిందే. ఇందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

దీంతో రెండు మూడు రోజుల్లో టెట్ నోటిఫికేషన్ వెలువడనుంది. జూన్ రెండో వారంలో పరీక్ష నిర్వహించనున్నట్టుగా సమాచారం. జనవరిలో టెట్ 2026 నిర్వహించారు. ఈ రెండో విడత పరీక్షకు 1.95 లక్షల మంది హాజరుకాగా.. టెట్ తప్పనిసరి నుంచి మినహాయింపు ఇస్తారని భావించి చాలా మంది దరఖాస్తు చేయలేదు.

ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి ఏడాది రెండు సార్లు టెట్ ఎగ్జామ్ ను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాదిలో మొదటి టెట్ నోటిఫికేషన్ విషయంపై విద్యాశాఖ. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి...