భారతదేశం, మే 27 -- TG SSC Supplementary Hall Tickets 2026 : తెలంగాణలో పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు విద్యాశాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. జూన్ నెలలో జరగబోయే ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. రెగ్యులర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన వారు ఈ పరీక్షలు రాయవచ్చు.

టెన్త్ విద్యార్థులు ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారిక వెబ్‌సైట్ అయిన bse.telangana.gov.in లోకి లాగిన్ అయి, తమ జిల్లా, పాఠశాల పేరు, పుట్టిన తేదీ మరియు విద్యార్థి పేరు వంటి వివరాలను నమోదు చేయడం ద్వారా హాల్ టికెట్లను పొందవచ్చు.

స్కూల్ లాగిన్ ద్వారా ప్రధానోపాధ్యాయులు (HM) కూడా తమ పాఠశాల విద్యార్థుల హాల్ టికెట్లను బల్క్‌గా డౌన్‌లోడ్ చేసి, సంతకం, సీలు వేసి విద్యార్థులకు అందజేస్తార...