భారతదేశం, ఏప్రిల్ 25 -- పదో తరగతి ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. అయితే సాధ్యమైనంత త్వరగానే ఈసారి ఫలితాలను ప్రకటించే దిశగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచే స్పాట్ వాల్యూయేషన్ ప్రారంభం కాగా.. నేటితో పూర్తి కానుంది. అన్ని సబ్జెక్టుల పేపర్ల దిద్దే ప్రాసెస్ పూర్తి కావటంతో. ఫలితాల క్రోడీకరణపై ఫోకస్ చేస్తున్నారు.

నేటితో స్పాట్ వాల్యూయేషన్ పూర్తి కానుండగా.. మరో వారం రోజుల పాటు క్రోడీకరణ ఉంటుంది. అంటే ఏప్రిల్ చివరికల్లా మొత్తం ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలోనే స్కానింగ్ ప్రక్రియ కంప్లీట్ చేస్తారు. మార్కుల క్రోడీకరణ (ట్యాబ్యులేషన్)లో ఎటువంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా పరిశీలిస్తారు.

అన్ని కుదిరితే ఏప్రిల్ 30 లేదా మే మొదటి వారంలో ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంటుంది. మొదటి వారంలోనూ మే 4 లేదా 5వ తేదీలు పర...