భారతదేశం, జూలై 22 -- Telangana Special TET Notification 2026 : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఇన్-సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేకంగా టీజీటెట్-2026 (TGTET-In-service Teachers-2026) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాష్ట్ర చరిత్రలోనే ఇన్-సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేకంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించడం ఇదే తొలిసారి. ఇవాళ్టి నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది.

ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారు తప్పనిసరిగా టెట్ అర్హత సాధించాల్సిందేనని, సెప్టెంబరు 2028 నాటికి (మూడేళ్ల వ్యవధిలో) ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించకపోతే ఉద్యోగంలో కొనసాగేందుకు వీల్లేదని గతేడాది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా నిర్వహించే రెండు సాధారణ టెట్‌లతో ...