భారతదేశం, ఆగస్టు 31 -- Telangana Special TET 2026 : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. సర్వీసులో ఉన్న టీచర్ల కోసం సెప్టెంబరు 8, 9 తేదీల్లో ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు పరీక్షలకు సంబంధించిన పూర్తి కాలపట్టికను (షెడ్యూల్) పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ఖరారు చేసింది.

ఈ ప్రత్యేక టెట్ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 24,983 మంది ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. టీచర్ల అర్హతలు, మాధ్యమాల ఆధారంగా పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ పక్కా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.

సుప్రీంకోర్టు ఉత్తర్వులు, విద్యాహక్కు చట్టం నిబంధనల ప్రకారం ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు కూడా టెట్ అర్హత తప్పనిసరి కావడంతో ప్రభుత్వం ఈ ప్రత్యేక పరీక్ష...