భారతదేశం, జూలై 18 -- Telangana QR Code Ration Card : ఆధునిక సాంకేతికతతో కూడిన సరికొత్త 'స్మార్ట్' రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.05 కోట్లకు పైగా కుటుంబాల కోసం క్యూఆర్ కోడ్‌తో (QR Code) కూడిన కార్డులను పంపిణీ చేయనుంది.ఈ కొత్త కార్డుల ప్రింటింగ్ ప్రక్రియ పూర్తి కాగా. పౌరసరఫరాల శాఖ ఇప్పటికే ఈ కార్డులను అన్ని జిల్లాలకు చేరవేసింది.

ఈ సరికొత్త స్మార్ట్ కార్డుల పంపిణీపై అధికారికంగా తేదీ రావాల్సి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పంపిణీ తేదీని ఖరారు చేసిన వెంటనే.. రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులకు వీటిని అందజేయనున్నారు. ఆ దిశగా అధికారులు కార్యాచరణను సిద్ధం చేశారు.

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పేపర్ రూపం నుంచి ప్లాస్టిక్ కార్డు రూపంలోకి రేషన్ కార్డులు రావడం ఇదే తొలిసారి. వీటిని మన చేతిలో ఉ...