భారతదేశం, మార్చి 20 -- అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ శిక్ష‌ణా కేంద్రాన్ని (SIDM) ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన ప్ర‌తిపాద‌న‌ల‌ను సిద్దం చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ఇందుకోసం సంబంధిత విభాగాల నుంచి ఉన్న‌త‌స్ధాయి క‌మిటీని ఏర్పాటు చేసుకొని కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని సూచించారు. దీనిపై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డితో చ‌ర్చించి తుది నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖలకు విపత్తు నిర్వహణపై ఒకే విధమైన శిక్షణను అందిస్తారు. శాస్త్రీయ పద్ధతుల ద్వారా ప్రాణ నష్టాన్ని, ఆర్థిక నష్టాలను కనిష్ట స్థాయికి తగ్గించడం వంటి వాటిపై ఫోకస్ చేస్తారు. క్షేత్రస్థాయిలో, ముఖ్యంగా జిల్లాల్లో విపత్తులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించడం. విపత్తుల న...