TG SET 2026 Notification : తెలంగాణ సెట్ నోటిఫికేషన్ విడుదల - దరఖాస్తు తేదీలు, పూర్తి షెడ్యూల్ ఇదే!
భారతదేశం, జూలై 28 -- TG SET 2026 Notification : రాష్ట్రంలోని యూనివర్సిటీలు, డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ఉద్యోగాలు పొందాలనుకునే అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. ఈ ఏడాదికి సంబంధించిన 'తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష' (TG-SET 2026) దరఖాస్తుల షెడ్యూల్‌ను ఉస్మానియా విశ్వవిద్యాలయం విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ, ఆలస్య రుసుము తేదీలు, హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌తో పాటు పరీక్ష నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాలను నోటిఫికేషన్లో పేర్కొంది.
టీజీ సెట్ పరీక్షను కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహిస్తారు. మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1లో 50 ప్రశ్నలు (100 మార్కులు), పేపర్-2లో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు నుంచి 100 ప్రశ్నలు (200 మార్కులు) ఉంటాయి. రెండింటికీ కలిపి మొత్తం 3 గంటల వ్యవధి ఇస్తారు.
పోస్ట్ గ్రాడ్యుయేషన్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.