భారతదేశం, జూన్ 30 -- Telangana Rythu Bharosa Scheme: రాష్ట్రంలోని అన్నదాతలకు పంట పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా వానాకాలం సీజన్‌ నిధులు మంగళవారం(ఇవాళ) విడుదల కానున్నాయి సాయంత్రం నుంచే రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఈ డబ్బులు జమ కానున్నాయి. మొదటి విడత కింద రెండు ఎకరాల వరకు భూమి ఉన్న 41.37 లక్షల మంది రైతులకు ఈ లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం ప్రభుత్వం రూ.2,482.02 కోట్లను సిద్ధం చేసింది.

హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించే 'రైతు ఆశీర్వాద సభ' ఇందుకు వేదిక కానుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ల్యాప్‌ట్యాప్‌లో మీట నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లోకి నిధులను బదిలీ చేస్తారు.

ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం... ఈ రైతు ఆశీర్వాద సభను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర శాసనసభ నియోజకవర్గ పర...