భారతదేశం, నవంబర్ 25 -- తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలు చేస్తే.. భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించింది. తాజాగా TG RERA ఉత్తర్వులను జారీ చేసింది. కొండాపూర్‌లోని ఆరో సఫైర్(Auro Sapphire) నివాస ప్రాజెక్టుకు రెరా నమోదు పొందకుండానే ప్రకటనలు, ప్రచార కార్యక్రమాలు చేపట్టింది. దీంతో ఆరో రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు తెలంగాణ రెరా రూ.25 లక్షల జరిమానా విధించింది. సుమారు 8 ఎకరాల విస్తీర్ణంలో నాలుగు టవర్లు, 1,300కు పైగా నివాస యూనిట్లతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టులో ఫ్లాట్ల ధరలు రూ.2 కోట్ల నుంచి ప్రారంభమవుతాయంటూ రెరా నమోదు లేకుండానే డిజిటల్ మాధ్యమాల్లో ప్రచారం నిర్వహించినట్లు అథారిటీ గుర్తించింది.

టీజీ రెరా సంస్థ పేరు, లోగోను ఇతర వ్యక్తులు అనధికారికంగా ఉపయోగించారన్న ప్రమోటర్ వాదనను అథారిటీ తోసిపుచ్చింది...