భారతదేశం, సెప్టెంబర్ 15 -- TSLPRB Recruitment 2026 : తెలంగాణలో పోలీసు కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు టీఎస్‌ఎల్‌ఆర్‌బీ కీలక సూచన చేసింది. విధి నిర్వహణలో భాగస్వామ్యమయ్యేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని స్పష్టం చేసింది. పోలీస్ ఉద్యోగాల ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. రేపటి(సెప్టెంబర్ 16)తో ఈ దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియనుంది.

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) ఇటీవలే విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 16వ తేదీ సాయంత్రం 5:00 గంటలలోపు తమ దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. వాస్తవానికి ప్రారంభ నోటిఫికేషన్ ప్రకారంగా సెప్టెంబర్ 9వ తేదీనే చివరి తేదిగా నిర్ణయించినప్పటికీ, అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞ...