భారతదేశం, జనవరి 3 -- మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా. త్వరలో ఎన్నికలు జరగబోయే మున్సిపాలిటీలకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాలు కూడా ఇప్పటికే విడుదలయ్యాయి. ఫైనల్ ఓటర్ జాబితాలను ప్రకటించిన తర్వాత. ఏ క్షణమైనా నోటిఫికేషన్లు జారీ అయ్యే అవకాశం ఉంది.

ఈనెలలోనే మున్సిపల్ ఎన్నికల నగారా మోగే అవకాశం ఉంది. అన్నీ కుదిరితే ఈనెల రెండో వారం లేదా మూడో వారంలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఓవైపు ప్రభుత్వ, మరోవైపు ఎన్నికల సంఘం ఆ దిశగా కసరత్తు చేస్తున్నాయి. ప్రాథమికంగా కూడా కొన్ని తేదీలను పరిశీలించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో గ్రీన్ సిగ్నల్ వచ్చిన క్షణమే.. ఈసీ నుంచి అధికారికంగా ప్రకటన విడుదలయ్యే సూచనలున్నాయి.

ఇటీవలనే రాష్ట్రవ్యాప్తంగా 117 మున్సిపాలిటీలకు...