భారతదేశం, ఫిబ్రవరి 13 -- మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పొటీ నెలకొంది. ప్రతి వార్డును కూడా సవాల్ గా తీసుకోగా.. మెజార్టీ స్థానాలు గెలిచిన పార్టీలు ఆయా మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పీఠాలను కైవసం చేసుకుంటాయి.

7 కార్పొరేషన్లలో 66.05 శాతం, 116 మున్సిపాలిటీల్లో 75.88 శాతం ఓటింగ్ నమోదైంది. చౌటుప్పల్‌ మున్సిపాలిటీలో 91.91 శాతం అత్యధికంగా నమోదవ్వగా.. అత్యల్పంగా నందికొండలో 59.68 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక కార్పొరేషన్లలో అత్యధికంగా నల్గొండలో 77.36 శాతం, అత్యల్పంగా నిజామాబాద్‌లో 59.12 శాతం ఓట్లు పడ్డాయి. 72.63 శాతం పురుష ఓటర్లు, 73.39 శాతం మహిళా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఫిబ్రవరి 11వ తేదీన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. అక్కడక్కడా...