భారతదేశం, నవంబర్ 26 -- తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఓటర్ దరఖాస్తుల ప్రక్రియ ముగింపునకు చేరుకోగా. తాజాగానే మహబూబ్‌నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్, వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల యంత్రాంగం విడుదల చేసింది. ఈ మేరకు ఓటర్ల డ్రాఫ్ట్ లిస్టును అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

రెండు స్థానాల్లో కలిపి మొత్తం 11,89,191 మంది పట్టభద్రులు ఓటు హక్కుకు అర్హత సాధించినట్లు ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ పేరు జాబితాలో ఉందో లేదో ఇప్పుడే తనిఖీ చేసుకోవచ్చు.

పట్టభద్రులు తమ ఓటు వివరాలను పరిశీలించుకునేందుకు ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ప్రత్యేక సదుపాయం కల్పించింది. చాలా సులంభంగా మీ వివరాలు ఉన్...