భారతదేశం, జూలై 31 -- తెలంగాణలో అనధికార ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ (LRS - Layout Regularization Scheme) దరఖాస్తుదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లింపుపై 25 శాతం రాయితీ పొందే అవకాశాన్ని 2026 నవంబర్ 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ (MA&UD) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ జీవో జారీ చేశారు.

దీనిద్వారా ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ రుసుమును నిర్ణీత గడువులోగా చెల్లించే ప్లాట్ల యజమానులకు 25 శాతం తగ్గింపు లభిస్తుంది. ఈ సదుపాయం 2026 ఆగస్టు 1వ తేదీ నుండి 2026 నవంబర్ 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయి.

రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న లక్షలాది ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి ఈ నిర్ణయం దోహదపడనుంది. ర...