భారతదేశం, ఆగస్టు 29 -- TG LAWCET Phase 2 Allotment : తెలంగాణలోని న్యాయ కళాశాలల్లో మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ లాసెట్ రెండవ విడత (ఫేజ్-2) సీట్ల కేటాయింపు ఫలితాలను అధికారులు అధికారికంగా విడుదల చేశారు. కౌన్సెలింగ్‌లో పాల్గొని వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్న అభ్యర్థులు తమకు కేటాయించిన కాలేజీ మరియు కోర్సు వివరాలను కౌన్సెలింగ్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా నేరుగా పరిశీలించుకోవచ్చు.

అలాట్ మెంట్ లో కాలేజీ వివరాలు చూసుకున్న తర్వాత, అభ్యర్థులు తమ ప్రవేశాన్ని ఖరారు చేసుకోవడానికి నిబంధనల ప్రకారం ట్యూషన్ ఫీజును ఆన్‌లైన్ విధానంలోనే చెల్లించాల్సి ఉంటుంది. అలాట్‌మెంట్ పేజీలోనే కనిపించే 'Pay Fee' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయడం ద్వారా పేమెంట్ గేట్‌వేకి వెళ్లవచ్చు. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా UPI ద్వారా నిర్ణీత ఫీజు...