భారతదేశం, ఏప్రిల్ 2 -- రాష్ట్రంలోని న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ లాసెట్ - 2026 కు సంబంధించి ఆన్ లైన్ దరఖాస్తులు కొనసాగుతున్నాయి . ఫైన్ లేకుండా దరఖాస్తు చేసుకునే గడువు ఏప్రిల్ 1వ తేదీతో ముగిసింది. ఈ నేపథ్యంలో అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. ఫైన్ లేకుండానే అప్లికేషన్ చేసుకునేందుకు ఏప్రిల్ 10వ తేదీ వరకు అవకాశం కల్పించారు.

ఇంటర్‌ విద్యార్హతతో 5 ఏళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు, డిగ్రీ విద్యార్హతపై మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌బీ పూర్తయిన వారికి రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఏప్రిల్ 10వ తేదీ దాటితే.. నిర్ణేశించిన ఫీజుతో పాటు ఫైన్ కూడా చెల్లించాల్సి ఉంటుంది.

టీజీ లాసెట్ - 2026 అప్లికేషన్ సాధారణ ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 900, జనరల్ అభ్యర్థులు రూ. 1100 చెల్లించాలి. పీజీఎల్ సెట్ కు దరఖాస్...