భారతదేశం, సెప్టెంబర్ 14 -- TG LAWCET 2026 Final Phase Counseling : తెలంగాణలో మూడేళ్లు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీతో పాటు ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన 'టీజీ లాసెట్, పీజీలాసెట్ 2026' చివరి విడత (ఫైనల్ ఫేజ్) వెబ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటివరకు కౌన్సెలింగ్‌లో పాల్గొనని అభ్యర్థులకు న్యాయ విద్యలో చేరేందుకు ఇది చివరి అవకాశమని అధికారులు తెలిపారు.

మొదటి, రెండో విడత కౌన్సెలింగ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోని అభ్యర్థులు సెప్టెంబర్ 15 నుంచి 17వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో ప్రాసెస్ ఫీజు చెల్లించి, ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

గత విడతల్లో సీట్లు పొంది కళాశాలల్లో చేరని అభ్యర్థులకు. అలాగే ఫేజ్-1, ఫేజ్-2లలో పొందిన సీట్లను రద్దు చేసుకున్న విద్యార్థులకు ఈ ఫైనల్ ఫేజ్ వెబ్ ఆప్షన్లు ఇచ్చేందుకు అర్హత లేదని కన్వీనర్ స్పష్టం చేశారు

P...