భారతదేశం, మే 29 -- TG Social Welfare JCCET Results 2026 : తెలంగాణ రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు అప్డేట్ వచ్చేసింది. ఇందుకు సంబంధించిన ఎంట్రెన్స్ ఫలితాలను (జేసీసెట్‌) రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ విడుదల చేశారు. ఈ ఫలితాల ఆధారంగా ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు గానూ మొదటి విడతలో (First Phase) మొత్తం 18,401 మంది విద్యార్థులు సీట్లు సాధించి ఎంపికయ్యారు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 229 సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఎంపీసీ (MPC), బైపీసీ (BiPC), ఎంఈసీ (MEC), సీఈసీ (CEC), హెచ్ఈసీ (HEC) గ్రూపులతో పాటు వివిధ ఒకేషనల్ కోర్సుల్లో కలిపి మొత్తం 19,740 ఇంటర్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సీట్ల భర్తీ కోసం విద...