భారతదేశం, ఏప్రిల్ 24 -- IPS Transfers in Telangana : పోలీస్ శాఖలో కీలక బదిలీలు జరిగాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ బదిలీలు మే 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.

1994 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారిణి శిఖాగోయల్‌ను ప్రభుత్వం కీలకమైన హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది. ప్రస్తుతం ఆమె విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హోం సెక్రటరీగా బాధ్యతలు చేపట్టినప్పటికీ... ఆమె తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌గా, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL) డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలను కూడా కొనసాగిస్తారు.

శిఖాగోయల్ స్థానంలో దేవేంద్ర సింగ్ చౌహాన్ (1997 బ్యాచ్) విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డైరెక్టర్ ...