భారతదేశం, మే 2 -- తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపునకు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి గడువును మే 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగించింది. ఈ పొడిగింపు మొదటి, రెండో సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులతోపాటు ఫెయిల్ అయిన విద్యార్థులకు కూడా వర్తిస్తుంది. ఆలస్య రుసుముగా రూ. 3,000 చెల్లించాల్సి ఉంటుంది.

మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు మే 13 నుండి మే 21 వరకు జరుగుతాయి. ఇక ప్రాక్టికల్ పరీక్షలు మే 22 నుండి మే 25 వరకు రెండు సెషన్లలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు.

మొదటి సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష మే 26న ఉదయం 10 గంటల నుండి, రెండో సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగుతుంది. ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్ పరీక...