భారతదేశం, మార్చి 9 -- రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ పరీక్షలన్నీ మార్చి 18వ తేదీతో పూర్తవుతాయి. ఈసారి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు కలిపి 9,97,075 విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తున్నారు. మొదటి సంవత్సరంలో 4,89,126 మంది, రెండో సంవత్సరంలో 5,07,949 మంది ఉన్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,495 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

ఓవైపు పరీక్షలు కొనసాగుతుండగా. మరోవైపు స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. సంస్కృతం సబ్జెక్ట్ పేపర్ల మూల్యాంకనం పూర్తి అయింది. ఇక మిగిలిన పేపర్లను 3 విడతల్లో పూర్తి చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది.

ఇక స్పాట్ వాల్యూయేషన్ లో ఎలాంటి తప్పులకు అవకాశం లేకుండా ఇంటర్ బోర్డు పకడ్బందీ చర్యలు చేపట్టింది. పేపర్ వాల్యూయేషన్ తర్వాత సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్ పరిశీలిస్తారు. ఆ...