భారతదేశం, మార్చి 30 -- రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు కలిపి 9 లక్షలకుపైగా విద్యార్థులు ఎగ్జామ్స్ కు హాజరయ్యారు. మొదటి సంవత్సరానికి సంబంధించి 4 లక్షల మంది, రెండో సంవత్సరానికి సంబంధించి 5 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా ప్రస్తుతం ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

ఓవైపు పరీక్షలు జరుగుతుండగానే. మరోవైపు అధికారులు ఇంటర్ స్పాట్ వాల్యూయేషన్ చేపట్టారు. మూడు విడతల్లో చేపట్టిన ఈ ప్రక్రియ తాజాగా పూర్తి అయింది. ప్రస్తుతం క్రోడీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ కూడా పూర్తి అయితే సాంకేతిక అంశాలను పరిశీలిస్తారు. సీజీజీ(సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్) ట్రయల్స్ నిర్వహిస్తారు. అంతా ఒకే అనుకుంటే ఫలితాల విడుదలకు ఓ తేదీని ప్రకటిస్తారు.

ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి అయిన నేపథ్యంలో ఫలి...