భారతదేశం, నవంబర్ 19 -- తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి(TGBIE) 2027 వార్షిక పరీక్షలకు సంబంధించి కీలక ప్రకటన విడుదల చేసింది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ జనరల్, ఒకేషనల్ విద్యార్థుల కోసం ఫిబ్రవరి/మార్చి 2027లో నిర్వహించనున్న పబ్లిక్ పరీక్షల తాత్కాలిక టైమ్ టేబుల్‌ను విడుదల చేసిసంది.

ఈ షెడ్యూల్ ప్రకారం 2027 ఫిబ్రవరి 24 నుండి మార్చి 20 వరకు థియరీ పరీక్షలు జరగనున్నాయి. అన్ని థియరీ పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. ఇంటర్ ఒకేషనల్ కోర్సులకు కూడా ఇవే తేదీలు వర్తిస్తాయని, అయితే వాటి సబ్జెక్టుల వారీ టైమ్ టేబుల్‌ను త్వరలోనే విడిగా విడుదల చేస్తామని బోర్డు స్పష్టం చేసింది. థియరీ పరీక్షల కంటే ముందుగానే ఇంటర్నల్ అసెస్‌మెంట్, ప్రాక్టికల్ పరీక్షలను పూర్తి చేస్తారు.

2027 జనవరి 20 నుండి జనవరి 25 వరకు ఇంటర్నల్ ...