భారతదేశం, అక్టోబర్ 15 -- తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్(TGBIE) మార్చి 2027లో జరగబోయే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు (IPE March 2027) సంబంధించిన ఫీజు చెల్లింపుల షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి ఒక ప్రకటన ద్వారా పూర్తి వివరాలను వెల్లడించారు.

మొదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులతో పాటు, ఫెయిల్ అయిన అభ్యర్థులు (జనరల్, వొకేషనల్), అలాగే అటెండెన్స్ మినహాయింపు పొందిన ప్రైవేట్ అభ్యర్థులు (ఆర్ట్స్/హ్యుమానిటీస్ గ్రూపులు) ఈ ఫీజు చెల్లించేందుకు అర్హులుగా పేర్కొన్నారు.

ఇంటర్‌ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలు విద్యార్థులు ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా, ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించేందుకు చివరి తేదీల వివరాలను ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఆలస్య రుసుము లేకుండా 26-10-2026 నుండి 09-11-2026 వరకు చెల్లి...