భారతదేశం, ఏప్రిల్ 28 -- Indiramma Indlu Scheme : సొంతింటి కల కలిగిన నిరుపేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఇందిరమ్మ ఇండ్లు' పథకం ఇకపై మరింత వేగవంతం కానుంది. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగిస్తూ, లబ్ధిదారులకు త్వరితగతిన న్యాయం చేసే దిశగా ప్రభుత్వం అధికార వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌లోని హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ఇన్‌ఛార్జ్ మంత్రులు, ప్రజాప్రతినిధులు మరియు ఉన్నతాధికారులతో జరిగిన ఈ భేటీలో హౌసింగ్, రెవెన్యూ అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు అనేది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదని. ఇది నిరంతర ప్రక్రియ అని గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీ...