భారతదేశం, సెప్టెంబర్ 21 -- క్యూర్ పరిధిలో ఇందిరమ్మ (తక్కువ ఆదాయ వర్గాల) ఫ్లాట్ల కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలకు మరో ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. ఈ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు అలాట్‌మెంట్ లెటర్లు (కేటాయింపు పత్రాలు) జారీ చేసే ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమవుతుంది. ఈ మేరకు తెలంగాణ హౌసింగ్ బోర్డు ప్రకటన జారీ చేసింది.

లబ్ధిదారులు ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా తెలంగాణ ప్రభుత్వం పారదర్శకంగా డిజిటల్ విధానంలో ఈ పత్రాలను పంపిణీ చేస్తోంది. ఎంపికైన వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు నేరుగా వాట్సాప్ (WhatsApp), ఎస్సెమ్మెస్ (SMS) ద్వారా ఈ అలాట్‌మెంట్ లేఖలను పంపుతున్నారు. దీనివల్ల లబ్ధిదారులు వేగంగా, ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా తమ వివరాలను సరిచూసుకునే అవకాశం లభిస్తుంది.

ఫోన్ ద్వారా మాత్రమే కాకుండా అధికారిక పోర్టల్ ( https://tghb.telangana.go...