భారతదేశం, మార్చి 18 -- రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ఐసెట్ - 2026 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం. ఆలస్య రుసుం లేకుండా మార్చి 16వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. అయితే ఈ గడువు పూర్తి అయిన నేపథ్యంలో అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు.అర్హులైన అభ్యర్థులు మార్చి 23వ తేదీ వరకు లేట్ ఫీజు లేకుండానే అప్లయ్ చేసుకోవచ్చు.

టీజీ ఐసెట్ ప్రవేశ పరీక్ష ద్వారా 2026- 2027 విద్యా సంవత్సరానికి గానూ అడ్మిషన్లు ఇస్తారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా నల్ల‌గొండ‌లోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష బాధ్యతలను చూస్తోంది.

టీజీ ఐసెట్ - 2026 కు మార్చి 23 వరకు ఆలస్య రుసుం లేకుండా అప్లికేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు కింద జనరల్ విద్యార్థులు రూ.750, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థ...