భారతదేశం, ఆగస్టు 2 -- TG ICET Counselling 2026 : రాష్ట్రంలోనిఎంబీఏ (MBA), ఎంసీఏ (MCA) కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు అప్డేట్ వచ్చేసింది. 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి సీట్ల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. టీజీ ఐసెట్ కౌన్సెలింగ్‌లో పాల్గొనడానికి అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 5వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

టీజీ ఐసెట్ ప్రవేశాల షెడ్యూల్ ప్రకారం. ఆగస్టు 1 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు నిర్దేశించిన హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన (సర్టిఫికెట్ వెరిఫికేషన్) నిర్వహిస్తారు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన అభ్యర్థులు తమకు ఇష్టమైన కళాశాలలు, కోర్సులను ఎంచుకోవడానికి ఆగస్టు 3 నుండి 8వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు.

అభ్యర్థులు నమోదు చేసుకున్న వెబ్ ఆప్షన్ల ఆధారంగా ఆగస్టు 11వ తేదీన ల...