భారతదేశం, జనవరి 29 -- రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ఐసెట్ - 2026 షెడ్యూల్ విడుదలైంది. 2026- 2027 విద్యా సంవత్సరానికి గానూ అడ్మిషన్లు ఇస్తారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా నల్ల‌గొండ‌లోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష బాధ్యతలను చూడనుంది.

టీజీ ఐసెట్ - 2026 కు సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి 6వ తేదీన జారీ చేస్తారు. ఫిబ్రవరి 12 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభమవుతుంది. మార్చి 16 వరకు దరఖాస్తుల స్వీకరణకు అవకాశం ఉంటుంది.

టీజీ ఐసెట్ - 2026 రిజిస్ట్రేషన్ ఫీజు కింద జనరల్ విద్యార్థులు రూ.750, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.550 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. రాత పరీక్షలు మే 13, 14 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తారు. నోటిఫికేషన్ జారీలో పూర్తిస్థాయి వివరాలను అందుబాటుల...