భారతదేశం, మే 26 -- TG Gurukul CET 2026 Admissions : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, వెనుకబడిన తరగతుల (బీసీ) సంక్షేమ, సాధారణ గురుకుల విద్యాలయాల (TGSWREIS, TGTWREIS, MJPTBCWREIS, TREIS) లో ప్రవేశాలు జరుగుతున్నాయి. 5వ తరగతితో పాటు ఇతర తరగతుల బ్యాక్‌లాగ్ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

ఇప్పటికే TGCET-2026 మొదటి విడత ప్రవేశాలు పూర్తి కాగా. ఇటీవలనే రెండో విడత సీట్లను కూడా కేటాయించారు. ప్రవేశ పరీక్ష మెరిట్, రిజర్వేషన్లు, అభ్యర్థులు ఎంచుకున్న ప్రాధాన్యతల (ఆప్షన్స్) ఆధారంగా విద్యార్థులకు తాత్కాలికంగా సీట్లను కేటాయించారు. సీట్లు పొందిన విద్యార్థులంతా కూడా ఆయా స్కూళ్లకు వెళ్లి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

ప్రవేశ పరీక్షలో కేవలం సీటు సాధించినంత మాత్రాన అడ్మిషన్ ఖరారు కాదని. ఎంపికైన అభ్యర్థులు నిర్ణీత గడ...