భారతదేశం, మే 24 -- TG Gurukul CET 2026 Result : రాష్ట్రంలోని వివిధ సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. తెలంగాణ గురుకుల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG Gurukul CET-2026) రెండో విడత ఫలితాలు విడుదలయ్యాయి.

ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో భాగంగా 2026-27 విద్యా సంవత్సరం కింద TGSWREIS, TGTWREIS, MJPTBCWREIS,TGREISల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. ఈ గురుకుల సొసైటీలన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తాయి. ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన ఉంటుంది. ఉచిత వసతి కల్పిస్తారు. ఇప్పటికే మొదటి విడత ప్రవేశాల ఫలితాలు విడుదల కాగా.సీట్లు పొందిన విద్యార్థులు రిపోర్టింగ్ కూడా పూర్తి చేశారు.

తాజాగా రెండో విడత సీట్ల ఫలితాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు 6 నుంచి 9వ తరగతి వరకు ఉన్న ఖాళీ బ్యాక్‌ లాగ్ సీట్ల భర్తీకి...